అనన్య న్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుమారు 4-5 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. మొదట కవితతో పాటు ఆమె ఇంట్లోని పని చేస్తున్న వాళ్ల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు కవిత గత 10 ఏళ్ల నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరించారు.
ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలను నిర్వహించారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై కూడా ఈడీ ఆరా తీస్తున్నారు. కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఆమె ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. మరోవైపు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కవిత నివాసానికి చేరుకున్నారు.