అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ మెగా డీఎస్సీ-2024 పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూలై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. గత నెల 29న డీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా టెట్ నోటిఫికేషన్ విడుదలతో విద్యాశాఖ గత నోటిఫికేషన్‌లో మార్పులు చేసింది. డీఎస్సీ కొత్త షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు తేదీని ఏప్రిల్ 3 నుంచి జూన్ 20 వరకు పొడిగించినట్టు పేర్కొంది. టెట్‌లో అర్హత సాధించిన వారు తిరిగి డీఎస్సీకి దరఖాస్తు చేసుకొనే విధంగా కొత్త డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేశామని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ప్రస్తుత డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.
HYD: డీఎస్సీ కొత్త షెడ్యూల్.. జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు..
RELATED ARTICLES