- ఘనంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు..
అనన్య న్యూస్, జడ్చర్ల: రక్తదానం ప్రాణదానంతో సమానమని మాజీమంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జడ్చర్ల చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు హాజరై 1023 యూనిట్ల రక్తదానం చేశారు. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని జడ్చర్ల ఎంబి మెడికల్ సెంటర్ నుండి చంద్ర గార్డెన్ వరకు భారీ బైక్, కార్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో పలుకూడల్లో కార్యకర్తలు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో లక్ష్మారెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు లక్ష్మారెడ్డికి ఘన స్వాగతం పలికారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజిని సాయిచంద్ లు హాజరై లక్ష్మారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నా జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపి, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నారు. మనం చేసే రక్తదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, పిఎసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.