అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మండలం గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను (జాతర) ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారిని దీప్తిరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 10వ తేదీన అలంకారాభిషేకం, 11న అంకురార్పణం, పల్లకీసేవ, 12న ధ్వజారోహణం, హనుమత్ వాహన సేవ, 13న తిరుకల్యాణం, 14న విశేషమైన సేవలు, 15న పుష్పరథం, 16న రథోత్సవం (పెద్దతేరు), 17న శకటోత్సవం (బండ్లు), 18న చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్రం, పక్క రాష్ట్రాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తారని, వారికి అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నామని, భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించి బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని తెలిపారు.
Jadcherla: ఫిబ్రవరి 10 నుంచి శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు..
RELATED ARTICLES