అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ గా యాభై మంది దరఖాస్తులు చేసుకోగా అందులో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. గవర్నర్ దీనిని ఆమోదించారు.
టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా పాల్వాయి రజనీ కుమారి, యాదయ్య, ఉమర్ ఉల్లా ఖాన్, రామ్మోహన రావులను నియమించింది. సభ్యుల పేర్లకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపింది. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిత రాజేంద్ర పేరును కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో టీఎస్‌పీఎస్సీ బోర్డు పూర్తి స్థాయిలో నియామకం జరిగినట్లే. త్వరలో కొత్త బోర్డు సమావేశమై పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించనుంది.