అనన్య న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటి ముఖ్యమంత్రిగా మధీర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తో పాటు రాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళీ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హజరయ్యారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
HYD: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..
RELATED ARTICLES