అనన్య న్యూస్, హైదరాబాద్ : ఇంటి వద్ద నుంచే ఓటు వేయాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగుల ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్దేశిత ఫారంను ముందుగానే అందజేయాలని కేంద్ర ఎన్నికల అధికారులు ఆదేశించారు. రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికల నిర్వహణ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధమవుతున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం పనితీరును మరోసారి సమీక్షించి తగు విధంగా సర్వసన్నద్ధం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ అధికారుల బృందం బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయాన్ని సందర్శించి తాజా స్థితిగతులను పర్యవేక్షించింది. పోలింగ్ కేంద్రాల వద్ద వారి కోసం ఏర్పాట్లను ప్రతి వివరాలు తెలుసుకునేందుకు ఆయన ఆసక్తి కనబరిచారు. ఈ బృందంలో కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, నితేష్ కుమార్ వ్యాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఉన్నారు.