అనన్య న్యూస్, జడ్చర్ల: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతిని ప్రతిష్టించి పూజించాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కే. నరసింహ తెలిపారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ నరసింహ 150 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజించాలని, పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టి విగ్రహాలను వాడితే కులవృత్తులపై ఆధారపడిన వారికి సహకారం అందించిన వారిమి అవుతామని అందుకే ప్రతి ఒక్కరూ మట్టి గణపతులకే జై కొడదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పి రాములు, డి.ఎస్.పి మహేష్, సీఐలు రమేష్ బాబు, జమ్ములప్ప, ఎస్సైలు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Jadcherla: మట్టి గణపతులను పూజించాలి: ఎస్పీ కే. నరసింహ..
RELATED ARTICLES