అనన్య న్యూస్, ఖమ్మం: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాలమూరు ప్రజల కరువు తీర్చే అతిపెద్ద ప్రాజెక్టు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గురువారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్ట్ ప్రారంభం చేస్తాం అంటే ప్రతిపక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ప్రాజెక్టు ప్రారంభాన్ని ప్రజలు పండుగలా భావిస్తే, వారు దండగ అంటున్నారు. ఓ వైపు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే మరో వైపు అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడు ప్రాజెక్టు ప్రారంభం చేస్తామంటే మళ్లీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కావాలి.. కాంగ్రెస్ వద్దు అని ప్రజలు నినదిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నోబెల్స్, గోబెల్స్‌కి మధ్య పోటీ జరగ బోతుందన్నారు. గోబెల్స్ ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీని ప్రజలు కోరుకోరు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలుస్తుందన్నారు.