అనన్య న్యూస్, జడ్చర్ల: జిల్లా ప్రత్యేక పోలీస్ విభాగంలో స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ వహాబ్ ఉత్తమ సేవలందించినందుకు గాను మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ రవి నాయక్, జిల్లా ఎస్పీ కే. నరసింహ ల చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకొని అబ్దుల్ వహాబ్ యువతకు ఆదర్శంగా నిలిచారని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ అన్నారు. బీసీ సేన ఆధ్వర్యంలో గురువారం జడ్చర్ల మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ఉత్తమ అవార్డు గ్రహీత వహాబ్ కు అభినందనలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ వహాబ్ తన వృత్తిలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో బాగి కృష్ణయ్య, బీసీ సేన నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి లింగంపేట్ శేఖర్, మండల అధ్యక్షులు బొల్లె మోని నిరంజన్, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, కార్మిక విభాగం మండల అధ్యక్షులు చంద్రమౌళి, జిల్లా నాయకులు గోపాల్, మాచారం శ్రీనివాస్, మండల కార్యదర్శి సురభి రఘు, ఆలూరు నర్సింలు, ఆంజనేయులు, విట్టల్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.