అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఈ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల కోసం బోర్డు వెబ్‌సైట్ mhsrb.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఆగస్టు 25 ఉదయం 10.30 గంటల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 19 సాయంత్రం 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ మేళా కొనసాగుతుందంటూ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.