అనన్య న్యూస్, నారాయణపేట: అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సంఘానికి సహకరించి, ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. రాజకీయ నాయకులకు ఈవీఎంలపై అవగాహన అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ లను మార్చుటకు ఈనెల 30 లోపు సమయం ఉన్నదని రాజకీయ పార్టీ ప్రతినిధులు సూచనలు ఇవ్వాలన్నారు. ఈసారి ఎన్నికల లెక్కింపు నారాయణపేట లోనే జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
ప్రతి శనివారం రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం జరుగుతుందనీ, 2 మొబైల్ వాహనాల ద్వారా ప్రజలకు ఈవీయంలపై అవగాహన కల్పించడానికి గ్రామ గ్రామాన పర్యటిస్తారని తెలిపారు. ఈవిఎంలలో పది శాతం అవగాహన కొరకు వినియోగిస్తామని తెలిపారు. గత ఎన్నికలలో ధన్వాడ, దామరగిద్ద, కృష్ణా మండలాలలో పోలింగ్ శాతం తక్కువగా ఉందని, పెరిగేలా చూడాలని అన్నారు. ఈసారి జరిగే ఎన్నికలలో ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేలా ఈవీఎంలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.