అనన్య న్యూస్, జడ్చర్ల: ప్రభుత్వం నుంచి సాయం పొందిన వారు ఆ సర్కారును మరువొద్దని, ఆదుకునే ప్రభుత్వానికి అండగా ఉండాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్చర్ల పట్టణం, మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన (19) మందికి రూ.12.00 లక్షల విలువ చేసే సీఎం సహాయనిది చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గతంలో సీఎం సహాయనిధి నుండి మండలానికి ఒక్క చెక్కు కూడా వచ్చేది కాదని, నేడు వేలాది మందికి కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్నారు. చెక్కులు పొందిన వారు గ్రామాల్లోకి వెళ్లి చర్చించాలని, ఆర్థిక సాయం అందించి ఆదుకున్న ప్రభుత్వానికి, మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి:
మిడ్జిల్ మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన జడ్చర్ల మున్సిపల్ కార్మికులు నాగార్జున, చెన్నయ్య కుటుంబాలను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఈ మేరకు జడ్చర్లలో ఇరువురి కుటుంబ సభ్యులను కలిశారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరమని, వారి కుటుంబ సబ్యులకు మనోధైర్యం చెప్పారు.