అనన్య న్యూస్, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు హాకీంపేట్ విమానాశ్రయంలో గ్రాండ్ వెల్కమ్ దక్కింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంగళవారం ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసైతో పాటు మంత్రులు హకీంపేట్‌కు వెళ్లి ముర్ముకు స్వాగతం పలికారు. గచ్చిబౌలి స్టేడియంలో జయంతి ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి.
ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానంలో ముర్ము హకీంపేట చేరుకున్నారు. అక్కడ ఆమెకు రెడ్‌కార్పెట్ వెల్కమ్ దక్కింది. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై వెళ్లి ఆమెకు వెల్కమ్ పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి అభివాదం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు సీఎస్ శాంతికుమారి, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా రాష్ట్రపతి ముర్ముకు పుష్పగుచ్ఛాలు అందించారు.