అనన్య న్యూస్, పాల్వంచ: రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏండ్ల తరబడి అడవినే నమ్ముకున్న ఆదివాసీ, గిరిజన బిడ్డలను ప్రభుత్వం పట్టాభిషిక్తులను చేస్తున్నది. ఏళ్లకేళ్లుగా వారు గోసపడిన చోటే.. వారికి అపూర్వ గౌరవాన్ని అందిస్తున్నది. వారు సాగు చేసుకున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నది. శుక్రవారం ఖమ్మం జిల్లా పాల్వంచలోని సుగుణ ఫంక్షన్ హాల్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి మంత్రి హరీశ్ రావు పోడు పట్టాలను గిరిజన రైతులకు పంపిణీ చేశారు.
భద్రాచలం, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలకు చెందిన రైతులకు పోడు పట్టాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియా నాయక్, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.