అనన్య న్యూస్, జడ్చర్ల: శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మహబూబ్ నగర్ డి.ఎస్.పి మహేష్ తెలిపారు. గురువారం తొలి ఏకాదశి, బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం జడ్చర్ల సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో అన్ని మతాల పెద్దలతో జడ్చర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో డీఎస్పీ మహేష్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గోవదపై నిషేధం విధించారని, గోవులను అక్రమంగా రవాణా చేసిన, వధించిన చర్యలు ఉంటాయని తెలిపారు.
మతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలని ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మత సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, హిందూ, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.