- తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ
అనన్య న్యూస్, జడ్చర్ల: జర్నలిస్ట్ బండి అజయ్ కుమార్ ముదిరాజ్ ను కిడ్నాప్ చేసి దాడి చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని జడ్చర్ల ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ బండి అజయ్ కుమార్ ముదిరాజ్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దాడిని ఖండిస్తూ శనివారం జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జడ్చర్ల ముదిరాజ్ సంఘం, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్ట్ అజయ్ కుమార్ తన వృత్తి పరంగా వీడియో రికార్డ్ చేస్తుండగా అతని వీడియో కెమెరా ని తీసుకుని కిడ్నాప్ చేసి దాడి చేయడంతో పాటు ముదిరాజ్ కులం గురించి నీచంగా మాట్లాడిన తెలంగాణ ద్రోహి కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని, బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, కౌశిక్ రెడ్డి పై అతని అనుచరులపై కిడ్నాప్ కేసు, హత్య ప్రయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

అధికార బలంతో ఏ వ్యక్తినైనా కులం పేరుతో దూషించడం, దాడి చేయడం తగదని అన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు బయలుదేరి ముదిరాజ్ కులం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని సీఐ రమేష్ బాబుకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు పిట్టల మురళి, జడ్చర్ల మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు టైగర్ నరసింహ, నీరడీ శివకుమార్, కావలి రవి, కిషన్, నాగులు, వెంకటేష్, జగదీష్ మురళి, వీడియో శీను, రఘు, శాంతి , కోనేటి నరసింహ, పాతబజార్ శివ, చందు, దామోదర్, రవి, చరణ్, చందు, జగన్, ఓం ప్రకాష్, శ్రీధర్, ఆంజనేయులు, బాలు, నవీన్, మురళి, ఈటెశీను, శీను, రమణ, లు పాల్గొన్నారు.