అనన్య న్యూస్, రాజన్న సిరిసిల్ల: విద్యతోనే వికాసం.. విజ్ఞానం లభిస్తుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్య ఉంటేనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. అది ఒక తరగతి గది కాదు.. ఒక విజ్ఞానపు గని. తరగతి గది నాలుగు గోడలు భారతదేశ భవిష్యత్‌కు మూలస్తంభాలు అని చెప్పక తప్పదు. ఈ మాట చెప్తే అతిశయెక్తి అనిపించొచ్చు. కానీ ఇది వాస్తవం అని కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేటలో రూ. 8.5 కోట్లతో అభివృద్ది చేసిన విద్యా క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. సరిగ్గా వారం రోజుల కిందట ఇదే ఎల్లారెడ్డిపేటలో వేణుగోపాల స్వామి గుడి పునర్నిర్మాణం కోసం పూజ చేసుకున్నాం అని కేటీఆర్ గుర్తు చేశారు. సంవత్సరన్నర లోపల లఅద్భుతమైన ఆలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి సిరిసిల్ల ప్రజల చిరకాల కోరికను నెరవేర్చుతామన్నారు.
ఇప్పుడు ఈ పాఠశాలను చూస్తుంటే మేం మళ్లీ చదవుకోవాలనే ఉత్సాహం ఉంది. సంవత్సరన్నర పాటు ఈ పాఠశాల పునర్నిర్మాణానికి కష్టపడిన కూలీలందరికి అభినందనలు. విద్యార్థులకు మంచి వసతులు కల్పిస్తున్నాం.. అద్భుతాలు సృష్టించాం అని కేటీఆర్ తెలిపారు. అమెరికాలో ఎక్కడ పోయిన తెలుగు, తెలంగాణ ప్రజలు కోకొల్లలుగా తన దగ్గరకు వస్తుంటారని కేటీఆర్ తెలిపారు. వారిని చూస్తే సంతోషము అనిపిస్తది. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడుతున్నారు.
అమెరికాలోనూ నిరుపేదలు ఉన్నారు. అక్కడ కూడా తిండికి తిప్పలు ఉన్నాయి. వ్యవస్థలో లోపాలు వెతకాలనుకుంటే.. ఎప్పటికీ ఉంటాయి. కానీ ఉన్నంతలో ఏమేం మంచిగ చేశామో ఆలోచించాలి. ఆలోచించండి.. ఆగం కాకండి. తొమ్మిదేండ్ల క్రితం మన బడి ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా అయిందనే విషయాన్ని ఆలోచించండి. తెలంగాణ భూతల స్వర్గం అయిందని తాను అనడం లేదు. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రభుత్వం యొక్క నిబద్ధతత, చిత్తశుద్ధి గురించి ఆలోచించాలని కేటీఆర్ తెలిపారు.