అనన్య న్యూస్, జడ్చర్ల: సొంత అవసరాలకు ఇష్ట రాజ్యాంగ డ్రైనేజీలో సిమెంటు పైపువేసి దానిపై నుంచి రోడ్డుగా ఏర్పాటు చేశారు. డ్రైనేజీలో సిమెంట్ పైపు వేయడంతో డ్రైనేజీలో చెత్తాచెదారం పేరుకొని మురుగునీరు పారలేక ఆగి దుర్వాసన వెదజల్లుతోంది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రంగారావు తోట మెయిన్ రోడ్డుపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఎదురుగా (ఏపీజీవీబీ) ఎదురుగా మోరిలో సిమెంటు పైపు వేసి దారిగా ఏర్పాటు చేసుకొని వాడుకుంటున్నారు. డ్రైనేజీలో వేసిన పైపులో కవర్లు చెత్తాచెదారం ఇరుక్కున్న కారణంగా డ్రైనేజీలో బ్యాక్ వాటర్ ఆగి దుర్వాసన వెదజల్లుతోంది. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందికరమైన డ్రైనేజీలోని పైపును తొలగించాలని కోరుతున్నారు.