అనన్య న్యూస్, ఖమ్మం : ఖమ్మం పత్తి మార్కెట్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పత్తి బస్తాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.
ఈ అగ్నిప్రమాదంలో 2000 పత్తి బస్తాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు మార్కెట్ అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు ఎలా అంటుకున్నాయనే విషయంపై స్పష్టత లేదు. ఒక్క షెడ్డులో ఉన్న పత్తి బస్తాలన్నీ కాలి బూడిదయ్యాయి. అయితే ఈ బస్తాలు రైతులకు సంబంధించినవా.? లేక వ్యాపారులకు సంబంధించినవా.? అనే విషయం స్పష్టత రావాల్సి ఉంది.