అనన్య న్యూస్, హైదరాబాద్ : శంషాబాద్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓమహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓవ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన వెంకట సాయికృష్ణ కు అప్సర అనే యువతీతో పరిచయం ఉంది. సాయికృష్ణకు ఇప్పటికే వివాహమైఇద్దరు పిల్లలున్నారు. అయితే అప్సరతో సాయికృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని అప్సర అతడిపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే.. మూడవ తేదీన వీరిద్దరూ కారులో శంషాబాద్ లోని సుల్తాన్పల్లికి వెళ్లారు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సాయికృష్ణ ఆమె తలపై బండరాయితో మోది హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం తన కారులోనే ఆమె మృతదేహాన్ని సరూర్ నగర్ కు తీసుకువచ్చి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మ్యాన్ హాల్ లో పడేశాడని. అక్కడి నుంచి శంషాబాద్ తిరిగి చేరుకొని ఏమీ ఎరగనట్లు అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. సాయికృష్ణ సెల్ ఫోన్ సిగ్నల్స్ తో పాటు.. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కేసును పోలీసులు ఛేదించారు. సాయికృష్ణ.. అప్సరను అంతమొందించాడని తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. మ్యాన్ హాల్ లో మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఘటనాస్థలిలో తహశీల్దార్ పంచనామా నిర్వహించారు.