అనన్య న్యూస్, జడ్చర్ల: కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడుదామని జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ దొరేపల్లి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి యేటా 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ తయారవుతుందని, దీనిని తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా బట్ట, వెదురు, కాగితంతో చేసిన బ్యాగ్ లు ఇతర వస్తువులు వాడటం వల్ల తగ్గించవచ్చన్నారు. మొక్కలు నాటడం అనేది నిరంతర చర్యగా ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా చేపట్టాలని పిలుపునిచ్చారు. గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య మాట్లాడుతూ ప్రతి రోజు మన దినచర్య లో భాగంగా ఏదైనా ఒక పర్యావరణహిత కార్యక్రమం చేయాలన్నారు. అనంతరం చైర్ పర్సన్ గార్డెన్ లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సతీష్, చైతన్య, రామకృష్ణ, పరిశోధక విద్యార్థులు రమాదేవి, వాలంటీర్లు వీరంజనేయులు, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.
కాలుష్యాన్ని నివారిద్దాం: మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి..
RELATED ARTICLES