- జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
అనన్య న్యూస్, జడ్చర్ల: సమాజంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని, జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తామని చెప్పిన మాట ప్రకారం జర్నలిస్టుల చిరకాల ఆకాంక్ష నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు. నిత్యం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేసే జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా నిలిచేందుకే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించామన్నారు. ప్రస్తుతం 40 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించమని, ఇంకా ఎవరికైనా మిగిలిపోయి ఉంటే అర్హులైన జర్నలిస్టులకు త్వరలో కేటాయిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తాహాసిల్దార్ లక్ష్మీనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు బాధ్మి రవిశంకర్, పిట్టల మురళి, నాగిరెడ్డి జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.