- నిందితులకు శిక్షపడేలా చూస్తాం ఎమ్మెల్యే.
అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పద్మావతి కాలనీలో ఉన్న అక్షర కాన్సెప్ట్ పాఠశాల బస్సు దహనంపై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆరా తీశారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు బస్సుకు నిప్పు అంటించడంతో పూర్తిగా కాలిపోయిన పాఠశాల బస్సును సోమవారం ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఒక మహిళ పాఠశాలను నడుపుతుండగా ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి, శిక్షపడేలా చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల యజమానియానికి ధైర్యం తెలిపారు. ఎమ్మెల్యే వెంట పాఠశాల సిబ్బంది, బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.