అనన్య న్యూస్, జడ్చర్ల: అర్హులైన లబ్ధిదారులకే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా సోమవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మబావి గడ్డ 18 వ,19వ వార్డులలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ న్యాయమైన లబ్ధిదారుల ఎంపిక చేయడంలో భాగంగా తానే స్వయంగా ఇంటింటికి తిరుగుతూ అర్హులను గుర్తింస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..
RELATED ARTICLES