- ఈనెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం.
అనన్య న్యూస్, ముంబై: దేశంలో చెలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకున్నది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. క్లీన్ నోట్ల పాలసీలో భాగంగా రూ. 2 వేలనోట్ల చెలామణిని ఉప సంహరించు కున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈనోట్లను సర్కులేషన్లో ఉంచ వద్దని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. రెండు వేల రూపాయల నోట్లను ప్రజలు ఈ నెల23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈమేరకు ఒక్కొక్కరు ఒక్క విడతలో రూ. 20 వేలు మాత్రమే మార్చుకోవాలని తెలిపింది.