- అగ్నికి ఆహుతైన పిడిఎస్ బియ్యం, గన్ని బ్యాగులు
అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని గంగాపూర్ గంగాపూర్ శివారులోని బాదేపల్లి పత్తి మార్కెట్ యార్డులో గల సివిల్ సప్లై గోదాంలో ఆదివారం భారీ అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో నిల్వ ఉంచిన సుమారు 750 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం కాలి బూడిద అయ్యాయి. దీంతోపాటు 70వేలకు పైగా గన్నిబాగులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం వల్ల సుమారు 30 లక్షల ఆస్థినష్టం జరిగినట్టు సివిల్ సప్లై అధికారులు అంచనా వేశారు. మరోవైపు అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా, మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో సివిల్ సప్లై అధికారులు పరిశీలిస్తున్నారు.