అనన్య న్యూస్, మహబూబ్‌నగర్: ఎప్పుడే తినే మాంసాహారమే పాపం అతని పాలిట మృత్యుదేవత అయ్యింది. మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది. మాంసాహారం తినేటపుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నామాంసం ముక్కలు గొంతులో అడ్డం పడే ప్రమాదం ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా కోనాపురానికి చెందిన ముత్తయ్య విషయంలో అదే జరిగింది. ఎంతో సంతోషంగా కొడుకుతో కలిసి భోజనం చేస్తున్నాడు. అంతలో మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఊపిరాడక ముత్తయ్య చనిపోయాడు. ముత్తయ్య మరణంతో కుటుంబం విషాదంతో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గొంతులో మటన్ ముక్క ఇరుక్కొని ఊపిరాడక వ్యక్తి మృతి..
RELATED ARTICLES