అనన్య న్యూస్, హైదరాబాద్: అణగారిన వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం జడ్చర్ల ఫకీర్ హక్కుల సంఘం ఆధ్వర్యంలో 30 మంది హైదరాబాద్ లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక అన్ని వర్గాలకు, అన్ని కుల సంఘాలు, కుల వృత్తులకు ప్రభుత్వం చేయూతనిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం, సర్వమత సమ్మేళనంతో ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. పార్టీ అభ్యున్నతికి ప్రతి కార్యకర్త పాటుపడి ఉండాలని కోరారు. ప్రతి కార్యకర్తను పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ఫకీరు హక్కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
RELATED ARTICLES