అనన్య న్యూస్, హైదరాబాద్: మేడే రోజున పారిశుధ్య కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ తీపికబురు తెలిపారు. సోమవారం కార్మికుల వేతనాన్ని రూ.1000 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్కర్స్ తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు లబ్ది చేకూరనుంది. కాగా నెల వేతనంతో పాటు రూ.1000 అదనంగా కార్మికులకు అందనుంది. పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎం ప్రకటించారు. అలాగే త్వరలో ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచుతామని కేసీఆర్ అన్నారు. ఈ మేరకు జీతాల పెంపుపై చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.