అనన్య న్యూస్, జడ్చర్ల: కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులు, శ్రామికులు పనిచేయనిదే లోకం పోకడ ముందుకు సాగదని, ఒక పెద్ద భవన నిర్మాణం, ప్రాజెక్టు పనులు, చిన్న కాలువలు ఇలా ఏకార్యక్రమం తలపెట్టిన శ్రామికుల శ్రమ కృషి తోనే పనులు పూర్తవుతాయని శ్రామికులను కొనియాడారు.
కోవిడ్ సమయంలో ఇండ్ల నుంచి బయటికి రావడానికి భయపడ్డ పరిస్థితుల్లో కార్మికులే ధైర్యంగా ముందుకు వచ్చి వారి వారి కార్యకలాపాలు నిత్యం చేసినందుకే మనమంతా ఆరోగ్యంగా ఉండ గలిగామని పేర్కొన్నారు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ముందుకు సాగుదామని, భవిష్యత్తులో కూడా కార్మికులు శ్రామికుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం నిలబడి వారి అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.