అనన్య న్యూస్, హన్మకొండ: మంత్రి అమిత్ షా రిజర్వేషన్ల తొలగింపు వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు సీరియస్ అవుతున్నారు. అమిత్ షా వాక్యాలపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమిత్ షా వాక్యాలు బాధ కలిగించాయని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర హన్మమకొండ జిల్లాలో కొనసాగుతుంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా పర్యటిస్తున్న భట్టి విక్రమార్క సోమవారం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కమలాపూర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల సభలో హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మతానికి వ్యతిరేకంగా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ బయట బీజేపీని వ్యతిరేకిస్తూనే, పార్లమెంటులో పెట్టే ప్రతి బిల్లును సమర్థిస్తూ వత్తాసు పలుకుతోందని ఆ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. దేశ హోంశాఖమంత్రి ఒక మతానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. దేశాన్ని విభజించి మత రాజకీయాలు చేస్తే దేశాన్ని ఎవరు కాపాడాలని ఆయన నిలదీశారు.
కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు బాధను కలిగించాయి: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
RELATED ARTICLES