అనన్య న్యూస్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో కోల్‌కతా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన తర్వాత కోల్‌కతా మరింత అత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతోంది.
అటు పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన తర్వాత సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటివరకు ఈ ఐపీఎల్ సీజన్ లో కోల్‌కతా 3 మ్యాచ్ లలో 2 విజయాలు సాధించగా, సన్‌రైజర్స్ 3 మ్యాచ్ లలో ఒకటి గెలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్ సాధారణంగా బ్యాటర్‌లకు ఎక్కువగా అనుకూలంగా ఉండటంతో ఇరు జట్లు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.
కోల్‌కతా నైట్ రైడర్స్ : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఎన్. జగదీసన్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.