అనన్య న్యూస్: ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో సందడి చేస్తున్న మలయాళ భామ సంయుక్త మీనన్ ఇప్పుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె బ్లూ కలర్ డ్రెస్ లో మెరుస్తూ సందడి చేసింది. మలయాళంలో అనేక సినిమాల్లో నటించి భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్య పాత్రలో కనిపించి ఒక్కసారిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది సంయుక్త మీనన్. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. సంయుక్త మీనన్ ఇటీవల చేసిన సార్ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో తెలుగులో మరిన్ని సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది.