అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మండలంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డు పోచమ్మ దేవాలయం సమీపంలో రూ కోటి రూపాయలతో నిర్మిస్తున్న నూతన సిసి రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పరిధిలోని గంగాపూర్ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో నిర్మించిన స్మశాన వాటికను ప్రారంభించారు. గంగాపూర్ గ్రామంలో కొత్తగా నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధంతోపాటు మౌలిక వసతులు మెరుగయ్యాయని అన్నారు. ముందుగా
జడ్చర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు నాలుగేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల్లో పాలన మరింత మెరుగైందని, గ్రామీణ లకు ప్రభుత్వ పథకాలను మరింత దగ్గర చేసేందుకు తమ వంతు పాత్ర పోషించాలని కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమాలలో జడ్పీవై చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దొరేపల్లి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ సారిక, కౌన్సిలర్లు కుమ్మరి రాజు, మహేష్, చైతన్య చౌహన్, లత, జ్యోతి రెడ్డి, రమేష్, నాయకులు దోరేపల్లి రవీందర్, రామ్మోహన్, ఇర్ఫాన్, కృష్ణారెడ్డి, ఎంపీడీవో ఉమాదేవి, గంగాపూర్ సర్పంచ్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.