అనన్య న్యూస్, జడ్చర్ల: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముఖిత్ ఇంటి వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. రంజాన్ మాస విశిష్టతను ఎమ్మెల్యే కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, ముడా డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
RELATED ARTICLES