- జడ్చర్ల పరిధిలో 35 మందికి సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
అనన్య న్యూస్, జడ్చర్ల: పేదల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం భరోసానిస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్చర్ల పట్టణం, మండలానికి చెందిన 35 మంది లబ్ధిదారులకు రూ.12.38 లక్షల విలువచేసే సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యం అయిన వారు ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని అన్నారు. ప్రజలు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇమ్ము, ప్రీతమ్, నాయకులు బృందం గోపాల్, షేక్ బాబా, పరమటయ్య తదితరులు పాల్గొన్నారు.