అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా శనివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. అనంతరం, పరేడ్ గ్రౌండ్ లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ.. రిమోట్ ద్వారా శంకుస్థాపనలు చేశారు. 5 జాతీయ రహదారుల నిర్మాణం, బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్- మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులను ప్రారంభించారు. రూ.11,355 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జెండా ఊపి ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: ప్రధాని మోడీ
RELATED ARTICLES