టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనిత రామచంద్రన్ ను విచారిస్తున్న సిట్..
అనన్య న్యూస్, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు స్పీడ్ పెంచింది. శనివారం టీఎస్ పీఎస్సీ సెక్రటరీ అనిత రామచంద్రన్ ను సిట్ విచారిస్తోంది. మార్చి 31న అనిత రామచంద్రన్ కి సిట్ నోటీసులిచ్చింది. సెక్రటరీ ఆధీనంలోనే కాన్ఫిడెన్షియల్ విభాగం మొత్తం ఉంటుంది. ఈ క్రమంలో ప్రశ్నాపత్రాల తయారీ, వాటిని భద్రపరచడం పరీక్షలు నిర్వహించడం వాటిపై అనితను విచారించనుంది. గ్రూప్ 1 రాసిన ప్రవీణ్ ను విధుల నుంచి ఎందుకు తప్పించలేదన్న దానిపై అనితను ప్రశ్నించే అవకాశముంది.
ఇప్పటికే గ్రూప్ 1లో 100కు పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులను సిట్ విచారించి వారి స్టేట్ మెంట్ లను రికార్డ్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సిట్ 15 మందిని అరెస్ట్ చేసింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక మరో వారం రోజుల్లో సిట్ కు అందనుంది. పూణె నోటిఫైడ్ ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంది. ఏప్రిల్ 11న పూర్తి దర్యాప్తు నివేదికను సిట్ కోర్ట్ కు అందజేయనుంది. పేపర్ లీక్ ద్వారా నిందితుడు ఏ2 రాజశేఖర్ ఎలాంటి లబ్ధి పొంద లేదని భావిస్తోన్న సిట్ 14 లక్షలకు గాను రూ.4 లక్షలను సీజ్ చేసింది.