గూడు కల్పించిన సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం శ్రీను ..
అనన్య న్యూస్, జడ్చర్ల: ఇచ్చిన మాటని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నెరవేర్చారు. నాలుగు నెలల క్రితం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండలంలోని మాచారం గ్రామంలో పర్యటించారు. ఇల్లు లేక కేవలం గోడలు మాత్రమే ఉండి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బంది పడుతున్న మాల శ్రీను ఇంటిని చూసి ఎమ్మెల్యే చలించి పోయారు. శ్రీను కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని చేయూత నందించారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు తన సొంత నిధులు ఇస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే రెండు నెలల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు. మాట ఇస్తే తప్పని నేత అని మరోసారి రుజువు చేసుకున్నారు. అన్నట్లుగానే ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో బుధవారం మాచారం పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని శ్రీను కుటుంబ సభ్యులు స్థానిక నేతల సహకారంతో ఎమ్మెల్యేను కలిసి ఆనందం వ్యక్తం చేశారు. తమకు గూడు కల్పించినందుకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.