బిజినపల్లి, అనన్య న్యూస్: పిడుగు పాటుకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన లింగసానీపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం బిజినపల్లి మండల పరిధిలోని లింగసాని పల్లి గ్రామానికి చెందిన మేకల బాలకృష్ణ (22) అనే యువకుడు రోజు వారిగా గురువారం ఉదయం గొర్రెలను తీసుకొని మేత కొరకు గ్రామ శివారులోని పంట పొలాల్లోకి వెళ్ళాడు. ఒక్క సారిగా సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో గొర్రెలను చెట్ల కిందికి పంపించి వర్షం నుండి పక్కనే ఉన్న చెట్టు దగ్గరకు వెళుతుండగా అకస్మాతంగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. కళ్ళ ముందే తన తమ్ముడు పిడుగుపాటుకు గురై చనిపోవడం చూసి మృతుడి అన్న ఒక్కసారిగా షాకుకు గురయ్యాడు. జరిగిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి వెళ్లి వేసవికాలంలో పిడుగుపాటు అయిందని ఇదేమి కాలంరా బాబు, పిడుగు పడి మృతి చెందడం బాధాకరమైన విషయమని పలువురు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు.