అనన్య న్యూస్: గ్లామరస్ అండ్ ఫిట్ నెస్ బ్యూటీ శ్రీయ సరన్ కుర్ర కారులో హీట్ పెంచుతోంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అలా వచ్చి ఇలా వెళుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని నిత్యం సినిమాలతో దూసుకు పోతుంటారు. అలాగే చిత్ర పరిశ్రమలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో అలరిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్ ఒకరు. గతేడాది గమనం, ఆర్.ఆర్.ఆర్, దృశ్యం 2 చిత్రాలతో సందడి చేసిన ఈ సీనియర్ గ్లామర్ బ్యూటీ తాజాగా కబ్జా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కబ్జా కోసం ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అలాగే పలు మ్యాగజైన్స్ కోసం ఫొటోషూట్ లు చేస్తోంది. అయితే తాజాగా చేసిన ఫొటోషూట్ లో అందాలు కనిపించేలా పోజులిచ్చింది.