- భారతీయ సినీ చరిత్రలో ఒక సంచలనం .. నాటు నాటు పాట
- ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకోవడం దేశానికే గర్వకారణం
హైదరాబాద్, అనన్య న్యూస్: ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు పాట తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిందని, భారతీయ సినీ చరిత్రలో నాటు నాటు పాట ఒక సంచలనంగా మారిందన్నారు.
నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల సీఎం కేసీఆర్ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. విశ్వ ఎవనికపై తెలుగు సినిమా సత్తా చాటిందని కొనియాడారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకోవడం తెలుగు వారికి, దేశానికి గర్వకారణ మని, తెలుగులోని కమ్మదనాన్ని చంద్రబోస్ వెలుగులోకి తెచ్చారని అన్నారు. ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు అని శుభాకాంక్షలు తెలిపారు.