జిల్లా కలెక్టర్ జి. రవినాయక్
మహబూబ్ నగర్, అనన్య న్యూస్: మొక్కలు ఎండకుండా వేసవి దృష్ట్యా హరితహారం కింద నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని పోయాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ తెలిపారు. శుక్రవారం మొక్కలకు నీరు అందించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మండల, గ్రామస్థాయిలో అధికారులు, సిబ్బంది అందరూ హరిత హారం కింద నాటిన మొక్కలకు, రహదారులకు ఇరువైపుల నాటిన మొక్కలు, సంస్థలు, గృహాలు, ఇతర సంస్థలలో నాటిన అన్ని మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయాలని. ఒకవేళ నీరు లేక ఎండలకు మొక్కలు ఎండిపోయే అవకాశం ఉందని, ఎండాకాలం వరకు మొక్కలను సంరక్షించుకోవాలని ఆయన కోరారు. నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా నీటితోపాటు, నీడ కల్పించాలని చెప్పారు. కలెక్టర్ వెంట కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శంకర్ తదితరులు ఉన్నారు.