అనన్య న్యూస్, హైదరాబాద్: సికింద్రాబాద్ కళాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి అయ్యింది. భాగ్యనగరంలో శనివారం ఉదయం నుంచి భారీగా వర్షం కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా మ్యాన్‌హోల్స్‌లో నుంచి నీరు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండడంతో చిన్నారి మౌనిక డ్రైనేజీలో పడిపోయింది. విషయం తెలిసిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది చిన్నారి కోసం గాలించగా పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు. శనివారం ఉదయం చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాల కోసం వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చివరకు మ్యాన్‌హోల్‌లో పడి పాప మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన చిన్నారి స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.
హైదరాబాద్ లో భారీ వర్షం.. మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి..
RELATED ARTICLES