అనన్య న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, మహిళలు, అమరవీర కుటుంబాలు, గల్ఫ్ కార్మికులను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. సోమవారం సరూర్ నగర్ సభలో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిక్లరేషన్ వివరాలను వెల్లడించారు. మొత్తం ఐదు అంశాలతో కూడిన 17 హామీలను ప్రకటించింది.
యూత్ డిక్లరేషన్:-
అమరవీరుల కుటుంబాలకు రూ. 25 వేల నెలవారీ పెన్షన్.
ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసుల ఎత్తివేత.
ఉద్యమంలో పాల్గొన్న యువతకుఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు.
ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ.
తొలి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ.
ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్, సెప్టెంబర్17 లోపు నియామకాల పూర్తి.
నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ. 4,000 నిరుద్యోగ భృతి.
ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన, యూపీఎస్సీ తరహాలో పరీక్షల నిర్వహణ.
కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణ.
రాష్ట్రంలో 7 జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్‌లు, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు.
ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం ఉద్యోగాలు.
తెలంగాణలోని విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్.
యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.
ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్.
ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలు.
ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ లో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు.
రాష్ట్రంలో 4 నూతన IIIT ల ఏర్పాటు చేసి, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తాం.
అమెరికాలోని IMG అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం.
పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్లలో విద్యాలయాలు.
18 సంలు పైబడి, చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..