అనన్య న్యూస్, జడ్చర్ల: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. జడ్చర్ల ఉమెన్స్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గత మూడు నెలల నుండి అందించిన కుట్టు శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ పాల్గొని శిక్షణ పొందిన మహిళకు శిక్షణ సర్టిఫికెట్లను అందజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు టైలరింగ్ వంటి స్వయం ఉపాధి శిక్షణ ద్వారా నైపుణ్యం పొంది ఆర్థికంగా లబ్ధి పొందాలని, వారు ఆర్థికంగా ఎదిగి నలుగురికి ఉపాధి చూపించాలని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు సూపరెండెంట్ అంజని కుమారి, కౌన్సిలర్ సతీష్, సొసైటీ అధ్యక్షులు బాలమణి తదితరులు పాల్గొన్నారు.