అనన్య న్యూస్: కన్నతల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తే ఊరుకోవాలా, పవన్ కళ్యాణ్ కు సొంత రాష్ట్రంపై ప్రేమ లేదా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని, ప్రజలను వైసీపీ మంత్రులు, నాయుకులు ఎవరూ ఏమనలేదని, కేవలం హరీష్ రావు వ్యాఖ్యలకు స్పందనగానే ఏపీ మంత్రులు మాట్లాడారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ ప్రజలను అన్నట్లు ఏపీ మంత్రులపై బురద జల్లుతున్నాడంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదంటూ ఏపీ మంత్రులను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కౌంటర్ ఇస్తే పవన్ కళ్యాణ్ మాత్రం అసత్యాలను మాపై రుద్ది రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నాడని నాని అన్నారు.
సొంత రాష్ట్రంపై ప్రేమ లేదా: పేర్ని నాని
RELATED ARTICLES