అనన్య న్యూస్, జడ్చర్ల: మారుతున్న కాలానుకులంగా సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం (డిటిసి) జడ్చర్లలో మంగళవారం ఈఎమ్ఆర్ఐ, జిఎంఆర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి పక్కన గల హోటల్స్, దుకాణ యజమానులకు, చేతివృత్తుదారులకు సిపిఆర్ చేయు విధానం గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ఇటీవల కాలంలో చాలా మంది గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరిలో సిపిఆర్ పై అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తున్నందువల్ల ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఒక వ్యక్తి వివిధ కారణాల వల్ల (యాక్సిడెంట్ వల్ల, పాము కాటు, కుక్క కాటు, ఆసిడ్పే, ష్టిసైడ్ లాంటివి సేవించి, కాల్చుకోవడం, నీటిలో పడడం) ఆపస్మరఖాస్థితిలో ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా ఉండి ఉంటే ముందుగా అతని దగ్గరికి వెళ్లి తట్టి లేపుతూ తన యొక్క మెదడు ఉత్తేజపరిచేలా చేయాలి, అలా స్పందించకపోతే ఆ వ్యక్తి యొక్క నాడి పని చేస్తుందా లేదా అని పరీక్షించిన అనంతరం పని చేయని సందర్భంలో అంబులెన్స్ కి, పోలీసులకి సమాచారం చేరవేసి అంబులెన్స్ వచ్చేవరకు సిపిఆర్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. దీనికోసం ఒక వ్యక్తి యొక్క ఛాతి మధ్య క్రింద భాగంలో రెండు చేతులతో ఛాతిపై ఒత్తుతూ ఒత్తిడి తేవాలి, అలా నిమిషానికి 100 నుండి 120 సార్లు కంప్రెసర్ చేయాలి. చాతిపై రెండు ఇంచుల లోతు వరకు ఒత్తిడి తెస్తూ సెకండ్ కి రెండు సార్లు చొప్పున కంప్రెసర్ చేయాలి (30 సార్లు వత్తిడి 2 సార్లు ఆక్సిజన్) ఇలా చేసేటప్పుడు దవడ భాగాన్నీ పైకి లేపి ఉంచాలి దానివల్ల నాలుగు అడ్డం రాకుండా ఆక్సిజన్ ఊపిరితిత్తులకు అంది మనిషి తిరిగి బ్రతికే అవకాశం ఉందని తెలియజేశారు. సిపిఆర్ శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రాములు, డిటిసి డిఎస్పి రామారావు, రోడ్ సేఫ్టీ డిఎస్పి చంద్రబాబు, జీవీకే, ఈఎంఆర్ఐ సిబ్బంది పాల్గొన్నారు.
సిపిఆర్ పై అవగాహన పెంచుకోవాలి: జిల్లా ఎస్పీ నరసింహ..
RELATED ARTICLES