- పాలఉట్లను కొట్టి పరవశించిన గుడేబల్లుర్
అనన్య న్యూస్, మక్తల్: మండల పరిధిలోని గుడెబల్లూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం శ్రీ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో జరిగిన పాలఉట్ల కార్యక్రమం ఎంతో రమణీయంగా సాగింది. వేలాది భక్తుల మధ్య ఈ ప్రాంతంలోనే అతి పొడవైన పాలఉట్ల స్తంభం ఎక్కి ఉట్లు కొట్టడం అనేది ఎంతో సాహసం అని చెప్పవచ్చు. ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు భక్తుల పాలిట ఉండటంతోటి ఎంతో నిష్ట నియమాలతో పాలఉట్ల కార్యక్రమాన్ని కొట్టేందుకు సిద్ధమైన భక్తులు వేలాదిమంది భక్తుల మధ్య స్తంభాన్ని ఎక్కుతూ పాలఉట్లు కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఒకరిపై ఒకరు పాకుతూ వెళ్ళగా క్రింద పడుతూ మళ్లీ పైకి ఎక్కుతూ ఇలాంటి దృశ్యాలను చూస్తున్న భక్తులు ఎంతో తన్మయించిపోయారు. చివరికి స్వామి వారిని మదిలో తలుచుకొని పాలఉట్లు కొట్టే భక్తులు స్తంభాన్ని ఎక్కి చివరికి పాలఉట్లను కొట్టారు. ఏడు కొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా అంటూ భక్తులు వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేస్తూ తరించిపోయారు. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తో పాటు వివిధ పార్టీల నాయకులు పాలఉట్ల కార్యక్రమం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు.